పాహి రామ రామాయనుచు
ఖరహరప్రియ రాగం,
రూపక (తిశ్ర లఘు)తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
పాహి రామ రామాయనుచు భజన సేయవే
పాహి రామ రామాయనుచు భజన సేయవే
చరణం :
కనికరంబు బల్కి సీత కాంతుని కనగా
మనసు రంజిల్ల బల్కే మదన జనకుడా
...పాహి రామ రామాయనుచు భజన సేయవే
వల్వను దిద్ది సౌమిత్రి వలచి నిల్వగా
కలువ రేకులను గేరు కనులు జూచెను
...పాహి రామ రామాయనుచు భజన సేయవే
భరతుడా వేళ కరగి కరగి నిల్వగా
కరము బట్టి కౌగిలించె వరదుడప్పుడు
...పాహి రామ రామాయనుచు భజన సేయవే
ఛండ శత్రుఘ్నుడపుడ ఖండ వృత్తితో
నుండ సంత సిల్లే కోదండరాముడు
...పాహి రామ రామాయనుచు భజన సేయవే
మనసు దెలిసి కలసి హనుమంతుడుండగా
చనువు మాట లాడు చుండె సార్వభౌముడు
...పాహి రామ రామాయనుచు భజన సేయవే
వీరి కరుణ కలిగి ఎపుడు వెలసి యుండునో
సారమైన భక్తి చే సన్నుతింతునో
...పాహి రామ రామాయనుచు భజన సేయవే
ధర్మార్ధ కామ మోక్ష దాన మేలనే
మర్మ మెరుగ లేని ఇంద్రశర్మ మేలనే
...పాహి రామ రామాయనుచు భజన సేయవే
బాగ కరుణా చేసి ఎపుడు భవ్య మొసగునో
త్యాగరాజు చేయి బట్టి దయను జూచునో
పాహి రామ రామాయనుచు భజన సేయవే
పాహి రామ రామాయనుచు భజన సేయవే
భజన సేయవే ….భజన సేయవే ….భజన సే..య..వే.
మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి
రిప్లయితొలగించండి