22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

Ramabadra dara రామభద్ర రారా

రామభద్ర రారా
శంకరాభరణరాగం,అది / ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
రామభద్ర రారా శ్రీరామచంద్రా రారా
తామరాసలోచన సీతా సమేత రారా
ముద్దు ముద్దుగారగ నవ మోహనాంగ రారా
అద్దంబు చెక్కిళ్ళవాడ నీరజాక్ష రారా
...‌‌‌..‌రామభద్ర రారా…..‌

చరణం :
చుంచు రవి రేఖతో నీ సొంపు చూపరారా
పంచదార చిలుకలతో పలుకుదువు రారా
పట్టరాని ప్రేమతో నా పట్టుకొమ్మ రారా
గట్టిగా కౌసల్య ముద్దుపట్టి వేగరారా
…..రామభద్ర రారా….

నిన్నేమనలేనురా నీలవర్ణరారా
కన్నుల పండువుగా నన్ను కన్న తండ్రి రారా
అందెల మువ్వల చేత సందడిస్తు రారా
కుందనపు బొమ్మ ఎంతో అందగాడా రారా
…...రామభద్ర రారా….

ముజ్జగములకు ఆదిమూల బ్రహ్మ రారా
గజ్జల చప్పుళ్ళు ఘల్లు ఘల్లు మనరారా
సామగాన లోల నా చక్కనయ్యరారా
రామదాసు నేలిన భద్రాద్రి వాస రారా
భద్రాద్రి వాస రారా...భద్రాద్రి వాస రారా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి