19, ఫిబ్రవరి 2019, మంగళవారం

Veera sainika sodara వీరసైనిక సోదరా

వీరసైనిక సోదరా
కళ్యాణిరాగం
రచన : నూజెళ్ళ శ్రీనివాసుగారు
స్వర రచన,గానం : ప్రణవి మొక్కరాల

పల్లవి :
వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా
తల్లి భారతి ఋణము తీర్చే తనయుడవు నీవేనురా
….వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా….

చరణం:
కన్నతల్లిని ఉన్న ఊరిని అయిన వారిని విడిచిపెట్టి
మిన్నయగు మన జన్మభూమిని రక్ష చేయుగ దీక్షపట్టి
గడ్ఢకట్టే మంచులో నిప్పులను చిందు ఎడారిలో
వెన్ను చూపని తెగవుతో సరిహద్దులను కాచావురా
...వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా….

మతము పేరిట మతిభ్రమించిన ఉగ్రవాదుల పీఠమణచి
ప్రగతి రథమును ప్రతిఘటించే తీవ్రవాదుల వెన్నువిరిచి
విర్రవీగు విదేశ శక్తుల కుతంత్రాలను త్రిప్పికొట్టి
విశ్రమించని పటిమతో దేశమును రక్షించావురా
…..వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా…

దిక్కులన్ని పిక్కటిల్లగా జైహింద్ అని నాదమిచ్చి
కనుల నిండా నిదురనిచ్చి కలలు పండగ రక్షణిచ్చి
కణము కణము దేశసేవకు అర్పణము చేశావురా
…వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా..

రాళ్ళుదువ్వే రక్కసులు నీకాలిగోరికి సాటిరారు
వెన్నుపొడిచే పిరికిపందలు నీకు ఎదురుగా నిలువలేరు
భావితరములు పాడుకొను నీ వీరచరితము ఆర్తితో
భరతమాత గళాన మణులై వెలుగు సమాన కీర్తితో

….వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా
తల్లి భారతి ఋణము తీర్చే తనయుడవు నీవేనురా
వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా….

1 కామెంట్‌:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి