ఓం అనరా
రాగం :రేవతి రాగం , తాళం : ఏక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
రమణ మహర్షి పాట
( భక్తి గీతాలు )
Audio
పల్లవి :
ఓం అనరా ఓంకార బ్రహ్మము కనరా...2
శంకను తీర్చి సంకటమును బాపి
వేంకట రమణుని వంక చేర్చునిక
ఓం అనరా ఓంకార బ్రహ్మము కనరా
చరణం :
పూరక కుంభక రేచకములచే
వాయువు కట్టిన ఆయువు పెరుగును
గురువాజ్ఞనుగొని చెవి రంధ్రమునను
స్థిరముగా మూసిన నాదము విందువు
ఓం ఓం
... ఓం అనరా ఓంకార బ్రహ్మము కనరా….
పుట్టుట గిట్టుట భ్రమయని తెలిసిన
గట్టిగా నెరుగుదు గుట్టును నీవు
అక్షీణంబగు నంతట మెలిగెడి
మోక్షప్రదమగు ఆత్మను కూడుదువు
….ఓం ఓం ఓం అనరా..2
ఓంకార బ్రహ్మము కనరా…
అంతరేంద్రియ విషయ వాసనల
చింతించిన యెడ చింత చెందుదువు
సోహంబను నా హంసను చేరి
బహిరంతరము వెలుగును ప్రణవము
….ఓం ఓం ఓం అనరా..
ఓంకార బ్రహ్మము కనరా…
ఎది కనబడునో అది నశ్యంబని
మది నెరిగినచో వదలును ఆశయు
ఎది యున్నదియో అది సత్యంబని
మది నమ్ముము శ్రీ రమణుని వాక్యము
…..ఓం ఓం ఓం అనరా …
ఓంకార బ్రహ్మము కనరా
శంకను తీర్చి సంకటమును బాపి
వెంకట రమణుని వంక చేర్చునిక
ఓం ఓం ఓం అనరా
ఓంకార బ్రహ్మము కనరా...3