వచ్చెను అలమేలు మంగ
రాగం : హిందోళం ,తాళం : ఆది
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు
అన్నమయ్య సంకీర్తన ( అమ్మవారి పాటలు )
Audio
పల్లవి :
వచ్చెను అలమేలు మంగ…….
వచ్చెను అలమేలు మంగ ఈ .../…./…..
పచ్చల కడియాల పణతి చెలంగ...
వచ్చెను అలమేలు మంగ…….
చరణం :
బంగారు చేదివిటీలు పూని
శృంగారవతులు వేవేలు రాగా
బంగారు చేదివిటీలు పూని
శృంగారవతులు వేవేలు రాగా
రంగైన వింజామరలు వీవ...2
మాంగల్యలీల సొంపగు జవరాలు..2
…..వచ్చెను అలమేలు మంగ ఈ
పచ్చల కడియాల పణతి చెలంగ
వచ్చెను అలమేలు మంగ…….
పలుకుల తేనియ లొలుక చెంత
చిలుకలు కలకల పలుక ...
పలుకుల తేనియ లొలుక చెంత
చిలుకలు కలకల పలుక
రవల గిలుక పావలు ముద్దుగులుక మేటి
కలికి చూపుల మొనలు తళుకని చిలుక
వచ్చెను అలమేలు మంగ
రవల గిలుక పావలు ముద్దుగులుక మేటి
కలికి చూపుల మొనలు తళుకని చిలుక
వచ్చెను అలమేలు మంగ ఈ
పచ్చల కడియాల పణతి చెలంగ
వచ్చెను అలమేలు మంగ…….
రంభాది సతులెల్ల చేరి
రంభాది సతులెల్ల చేరి యెదుట
గంభీర గతులను మీర
రంభాది సతులెల్ల చేరి యెదుట
గంభీర గతులను మీర
నటనా రంభములను మేలుకోరి
నటనా రంభములను మేలుకోరి కొలువ
అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి..2
…….వచ్చెను అలమేలు మంగ ఈ
పచ్చల కడియాల పణతి చెలంగ…..2
వచ్చెను అలమేలు మంగ……3
మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి
రిప్లయితొలగించండి