25, ఏప్రిల్ 2020, శనివారం

Emi niddirinchevu ఏమి నిద్దిరించేవు

ఏమి నిద్దిరించేవు
రాగం: వసంత , తాళం : ఖండచాపు
స్వర రచన : సత్తిరాజు వేణు మాధవ్ గారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

పల్లవి :
ఏమి నిద్దిరించేవు ఎందాకాను
కామించి బ్రహ్మాదులెల్ల కాచుకున్నారిదివో

చరణం :
ఉలుగాలు పచ్చళ్ళు బోనము వెట్టినరిదే
వెలయు ధనుర్మాస వేళయునిదే
బలసి సంకీర్తనపరులు పాడేరిదే...
జలజాక్షుడా లేచి జలకమాడుమయ్యా
…..ఏమి నిద్దిరించేవు ఎందాకాను….

తోడనే గంధాక్షతలు ధూప దీపాలివిగో
కూడిన విప్రుల వేదా ఘోషణలివే
వాడు దేర పూజించవలె కమ్మపువ్వులివే
వీడెనిదె కొలువుకు విచ్చేయవయ్యా
….ఏమి నిద్దిరించేవు ఎందాకాను…..

చదివేరు వైష్ణవులు సారె తిరువాముడిదే
కలసి శ్రీసతి ముందే కాచుకున్నది
అదనాయ శ్రీవేంకటాధిప మాచరపిదే
ఎదుట నిన్నటి మాపే ఈయకుంటివయ్యా
.
…...ఏమి నిద్దిరించేవు ఎందాకాను
కామించి బ్రహ్మాదులెల్ల కాచుకున్నారిదివో
ఏమి నిద్దిరించేవు ఎందాకాను…...

1 కామెంట్‌:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి