21, డిసెంబర్ 2022, బుధవారం

Tandavadambara తాండవాడంబరా

 తాండవాడంబరా

Audio


శివపదం.. రచన: సామవేదం షణ్ముఖ శర్మగారు

రాగం: హంసానందిని, తాళం:ఆది…ఖండగతి

గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరి


పల్లవి:

తాండవాడంబరా తరుణేందు శేఖరా

అంబతో నటియించు హరా

పరమేశ్వరా శంకరా

తాండవాడంబరా…..2


చరణం:

మెరుపు సొగసులవోలె మెఱుగు చక్రమువోలె

వెలుగు కందుకమువలె జిలుగు తీగలవోలె

మెలికలును తిరుగుళ్ళు ఎగయుటలు సాగుటలు

సకల గమనమ్ములును చైతన్యమయ నీవే

తాండవాడంబరా…..2


సర్వ సంగీతమ్ము సాకారమై నిలిచి

అఖిల వాంగ్మయ రాశి హరమూర్తియై వెలిగి

వాద్య నాదములు ప్రణవాకారునే చేరి

చిత్రముగ జగమంత శివమయమ్మై వెలిగె

…..పల్లవి పూర్తిగా….


అల్లదిగో శ్రీశైలం

 అల్లదిగో శ్రీశైలం

Audio


రాగం: కాంభోజి, తాళం: ఆది

రచన: పాలగుమ్మి విశ్వనాధం గారు

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


పల్లవి:

అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం….

అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం

మల్లికార్జునుడు కాపురముండే ఇల్లదియేనా శ్రీశైలం

అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం…


చరణం:

సురల దొరల మణికిరీటములలో

మెరుపులడుగులకు హారతులంటా

మునుల ఋషుల ముఖముఖరములై

మనవులంట మరి కైవారములట

అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం….


ముక్కోటి ప్రమథులిరుగడలా

మొక్కుబడులు చెల్లింతురటా

కొండ కొమ్ముపై దేవితోడ

కొలువుండే దేవర చూసేదాక

క్షణకాలం మనజాలం… అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం….


దాక్కున్న కాశీపట్నంలో

ఎక్కున్న కైలాసపర్వతం

అక్కడికే వెళదాం హరాయని ఒకొక్క మెట్టె కడదాం

ఒక్క నిమిషమిక వదలం అయ్యను పక్క నుండి ఇక కదలం

హరోం హరోం హర… హరోం హరోం హర… హరోం హరోం హర … హరా హరా

హర

హరోం హరోం హర… హరోం హరోం హర… హరోం హరోం హర … హరా హరా

హర

హరోం హరోం హర… హరోం హరోం హర… హరోం హరోం హర … హరా హరా


హరోం హరోం హర … హరా హరా..2





అయ్యా శివయ్య

 అయ్యా శివయ్య

Audio


రాగం: మాయా మాళవ గౌళ రాగం, తాళం: ఖండగతి

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


పల్లవి:

అయ్యా శివయ్య ఆదుకోవయ్య

ఆప్తరక్షక బిరుదు నీకే కదయ్యా


చరణం:

ఆకలేస్తే అన్నపూర్ణయ్య

దాహమేస్తే నీవు గంగాధరయ్యా

భయము కలిగితే మాకు భీమేశ్వరయ్యా

రక్షించి కాపాడు రామేశ్వరయ్యా

…అయ్యా శివయ్య…


కోపమొస్తే నీకు ముక్కంటివయ్యా

పాపములు బాపేటి పరమేశ్వరయ్య

బిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా

మోక్షమిస్తావు కదా మా సంగమయ్యా

….అయ్యా శివయ్య….


వేడుకొంటే నువ్వు వెండి కొండయ్య

బెంగలను తీర్చే బంగారు లింగయ్య

అర్ధనారీశ్వర తత్వం గదయ్యా

జగమంత నడిచేను నీదయేనయ్యా


…అయ్యా శివయ్య ఆదుకోవయ్య

ఆప్తరక్షక బిరుదు నీకే కదయ్యా

ఆదుకోవయ్య….అయ్యా శివయ్య…2




బృందారక సందోహముతో

 బృందారక సందోహముతో

Audio


రచన: దేవునిపల్లి క్రిష్ణశాస్త్రీగారు

రాగం: మధ్యమావతి, తాళం: ఆది/ఏక

(గోదా దేవి పాట)(కోలాటం, పెళ్ళి పాట)

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


పల్లవి:

బృందారక సందోహముతో….

బృందారక సందోహముతో 

వందారు మౌని బృందముతో

పెందిరు వడి పెరుమాళ్ళే 

శ్రీ మందిరమును విడి తరలేరే


చరణం:

తులసీవనిలో మొలకయటే 

అలహరి కౌగిట చిలుకయటే

వెలసె నెయ్యమున విష్ణుచిత్తులకు 

నిలయ దీపమై వెలిగెనటే


విరజానది కావేరియటే 

పరమపదము శ్రీ రంగమటే

వరుడా రంగేశ్వరుడు కదా మన 

సిరి ఆండాళ్ళే వధువు కదా


…బృందారక సందోహముతో 

వందారు మౌని బృందముతో

పెందిరు వడి పెరుమాళ్ళే 

శ్రీ మందిరమును విడి తరలేరే

బృందారక సందోహముతో…2

సందోహముతో… సందోహముతో…..