అయ్యా శివయ్య
రాగం: మాయా మాళవ గౌళ రాగం, తాళం: ఖండగతి
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
పల్లవి:
అయ్యా శివయ్య ఆదుకోవయ్య
ఆప్తరక్షక బిరుదు నీకే కదయ్యా
చరణం:
ఆకలేస్తే అన్నపూర్ణయ్య
దాహమేస్తే నీవు గంగాధరయ్యా
భయము కలిగితే మాకు భీమేశ్వరయ్యా
రక్షించి కాపాడు రామేశ్వరయ్యా
…అయ్యా శివయ్య…
కోపమొస్తే నీకు ముక్కంటివయ్యా
పాపములు బాపేటి పరమేశ్వరయ్య
బిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా
మోక్షమిస్తావు కదా మా సంగమయ్యా
….అయ్యా శివయ్య….
వేడుకొంటే నువ్వు వెండి కొండయ్య
బెంగలను తీర్చే బంగారు లింగయ్య
అర్ధనారీశ్వర తత్వం గదయ్యా
జగమంత నడిచేను నీదయేనయ్యా
…అయ్యా శివయ్య ఆదుకోవయ్య
ఆప్తరక్షక బిరుదు నీకే కదయ్యా
ఆదుకోవయ్య….అయ్యా శివయ్య…2
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి