జయ జయ హారతి జానకిదేవికి
రాగం: కాపి, తాళం: ఏక
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
పల్లవి:
జయ జయ హారతి జానకీదేవికి
జనక సుపుత్రికి కనకభూషణికి
అనుపల్లవి:
రాయి అయిన అహల్యను రమణిగా చేసిన రఘుకులనాధుని తరుణీమణికి
……జయ జయ హారతి జానకీదేవికి
జనక సుపుత్రికి కనకభూషణికి…..
చరణం:
ధరణీ సుతులకై దైత్యులణచిన
దశరథ తనయుని తరుణీమణికి
పసిడి పళ్ళెరమున బాగనమర్చిన
పరిమళ హారతి పద్మపూజితకు
…..జయ జయ హారతి జానకీదేవికి
జనక సుపుత్రికి కనకభూషణికి…
జనక సుపుత్రికి కనకభూషణికి…
జనక సుపుత్రికి కనకభూషణికి…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి