తిధులు...వాటి ఫలితాలు
పాడ్యమి : ఉదయం పనులకు మంచిది కాదు. తిధి అర్ధ భాగం తరువాత మంచిది.
విదియ. : ఏకార్యము తల పెట్టిననూ శుభకరము.
తదియ. : అన్ని కార్యములందు విజయం, ఆనందం కలిగించును.
చవితి : మధ్యాహ్నం ఒంటిగంట తరువాత మంచిది.
పంచమి : శుభమునకు చిహ్నం. లాభము సమకూరును.
షష్ఠి : రాత్రి సమయము మంచిది.
సప్తమి : అన్ని కార్యములకు మంచిది.
అష్టమి : మంచిది కాదు.
నవమి : మంచిది కాదు.
దశమి : అన్ని కార్యములకు విజయము.
ఏకాదశి : అన్ని కార్యములకు విజయము.
ద్వాదశి : ప్రయాణములకు ఆహారం తిని వెళ్ళినచో శుభప్రదం, లాభం కలుగును.
త్రయోదశి : అన్ని కార్యములందు విజయము కలుగును.
చతుర్ధశి : మంచిది కాదు.
పౌర్ణమి : అన్ని కార్యములకు విజయము కలుగును.
అమావాస్య. : మంచిది కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి