19, అక్టోబర్ 2016, బుధవారం

శివశివశివ శివశివయనుడీ

శివశివశివ శివశివయనుడీ
రచన: శ్రీకూచమంచి సోమసుందర కవి, స్వరకల్పన : శ్రీ వేమూరి సరోజనీ శాస్త్రి , బేహాగ్ రాగము, ఆదితాళము


పల్లవి :
శివశివశివ శివశివయనుడీ
లవమైనను జాలము సేయకరండీ
...శివ….


చరణం :
వివిధ శాస్త్రములు వెదకి చూచినను
భవ తరణమునకుపాయము లేదిక
…..శివ……


కాలము వ్యర్ధముగానొనర్చి తుద
కాలకింకరుల పాలు గాకయిక
….శివ....


దేహమచలమని తెలివి గలిగి ఘన
మోహభ్రాంతిని మోసపోక యిటు
….శివ…


ఇరువుగ బలివెలపురినుండెడి శ్రీవరుని
గొప్పు లింగని మది దలచుచు
…..శివ….


తప్పక సుందర దాసుం
డిప్పుడు చెప్పిన సుద్దుల నొప్పుగ గైకొని
శివశివశివ శివశివయనుడీ
లవమైనను జాలము సేయకరండీ
శివశివశివ శివశివయనుడీ
శివశివశివ శివశివయనుడీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి