బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప
బహుధారి రాగం, ఆదితాళము
పల్లవి :
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప
పాహి పాహి పరమ శివ
అను పల్లవి :
నా మది నెమ్మది కుదిరే దాక వదలనుగా నిను మదనారి
గడియనైన నిను వీడని వాడను
ఈశ్వర అన్యుల వేడనయా
శివా పాహిమాం, భవా త్రాహిమాం
సదా దేహిమాం మహదేవా
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప……
చరణం :
త్రేతా యుగమున నీ అంశంమే సీతాపతిగా జనియించి
పాతక మతి యగు రావణ ఘాతుక జీవిత పతనము చేసితివి.
ద్వాపరమందున పాపము నాలుగు పాదమున నడయాడ
కృపతో కృష్ణుని పంపి పాపుల రూపు మాపితివి త్రిపురారి
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప…..
తలరాతలనే పలు తీరులుగా విధిగా రాసిరి మాంధాతా
తలనే నేలను కూలగ చేసిన ఫాలలోచన దయగనరా
భిక్షాం దేహి అని భిక్షకు వస్తే బదులుగా మోక్షం నిడుదువుగా
కుక్షిణి సర్వం దాచిన దేవా జగద్రక్షకా ఫాలాక్షా
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప
పాహి పాహి పరమ శివ
నా మది నెమ్మది కుదిరే దాక వదలనుగా నిను మదనారి
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప…….
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి