ఎంత పని చేసితివి రామా
ఖండగతి తాళం , నాదనామ క్రియ రాగం
Audio
ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా
పంతమా నా మీద పరమ పావన నామ
సంతోష ముడిపితివి సకల సద్గుణధామ
ఎంతపనిచేసితివి రామా
…..ఎంతపని….
నిన్నే దైవంబనుచు నమ్మి
తిన్నగా దుఃఖముల జిమ్మి
కన్న దినమని నమ్మి నిన్ను సేవింపగా
మున్నీట నన్నిట్లు ముంచుటెరుగక పోతి
ఎంతపని చేసితివి రామా
……..ఎంత పని……..
అన్నన్న మాట్లాడవేరా నీ కన్నులను నను చూడవేరా
చిన్నెలన్నియు తరిగియున్న నా చిన్నన్న క్రన్నా నను చూడు మాయన్న ఓ రామన్న
ఎంత పని చేసితివి రామా
…...ఎంత పని……
భద్రాద్రి వాసుడే యనుచు మమ్ము నిరుపద్రవముగా యుండు మనుచు
రుద్రనుత కరుణా సముద్ర ఓ శ్రీరామ భద్ర , నిన్నె మదిని భద్రముగా నమ్మితిని
ఎంత పని చేసితివి రామా
ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా
ఏమనందునుసార్వభౌమా...
నిన్నే మనందును సార్వ భౌమా….2
నిన్నే మనందును సార్వ భౌమా….2
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి