30, డిసెంబర్ 2016, శుక్రవారం

కొలని దోపరికి గొబ్బిళ్ళో

కొలని దోపరికి గొబ్బిళ్ళో


కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో….3


కొండ గొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండ గంపు దైత్యుల కెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో….2
ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో


పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
ఏపున కంసుని ఇడుమల బెట్టిన గోపబాలునికిని గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో….2
ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో


దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్లో
వెండి పైడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బియళ్ళో...2

ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో..2

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి