గొబ్బియళ్ళో సఖియా వినవే
పల్లవి :
గొబ్బియళ్ళో సఖియా వినవే
చిన్ని కృష్ణుని సోదరి వినవే
కృష్ణుని చరితము గానారే
చెలి కృష్ణుని చరితము గానారే
చరణం :
అష్టమినాడు గోకులమందు
చిన్ని క్రిష్ణుని జననమందు
భారతజననికి యశము తెచ్చెనేె
చెలి భారతజననికి యశము తెచ్చెనేె
…...గొబ్బియళ్ళో….
కరుపాండవుల సమరమందు దుఃఖితుడైన పార్థుని చూచి
గీతాగానం చేసేనే
చెలి గీతాగానం చేసేనే
…...గొబ్బియళ్ళో…..
దరిద్రుడైనా కుచేలునాకు
దరిశనమొసగిన మాధవుండు
ఆయన కోర్కె తీర్చేనే
చెలి ఆయన కోర్కె తీర్చేనే
గొబ్బియళ్ళో సఖియా వినవే
చిన్ని కృష్ణుని సోదరి వినవే
కృష్ణుని చరితము గానరే
చెలి కృష్ణుని చరితము గానారే
చెలి కృష్ణుని చరితము గానారే
చెలి కృష్ణుని చరితము గానారేే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి