27, డిసెంబర్ 2016, మంగళవారం

ఈడగు పెండ్లి

ఈడగు పెండ్లి

మధ్యమావతి రాగము  ఆదితాళము

పల్లవి :
ఈడగు పెండ్లి ఇద్దరి జేసేము
చేడెలాల ఇది చెప్పరుగా

చరణం :
పచ్చిక బయళ్ళు పడతి యాడగా
ముచ్చట కృష్ణుడు మోహించి
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట
గచ్చుల నాతని కానరుగా

ముత్తెపు ముంగింట ముదిత నడవగా
ఉత్తముడే చెలి వురమునకు
చిత్తరువు వ్రాసి చెలగి వచ్చె నొళ్ళ
జోత్తు మాని ఇటు చూపరుగా

కొత్త చవికలో కొమ్మ నిలిచితే
పొత్తున తలంబ్రాలు వోసెనట
ఇత్తల శ్రీ వేంకటేశుడు నవ్వుచు
హాత్తి సతి గూడెనని పాడరుగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి