గంధము పూయరుగా
పున్నాగ వరాలి రాగం, తిశ్రగతి తాళం
Audio
పల్లవి :
గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా...2
అందమైన యదునందనుపై కుందర ధన లిరు వందగ పరిమళ గంధము పూయరుగా
చరణం :
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా..2
కళ కళ మనుచు ముఖ కళగని సొక్కుచు
పలుకుల నమృతము లొలికే స్వామికి
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలురతో
ఆలమేపిన విశాల నయనునికి
చేలము గట్టరుగా బంగారు చేకము గట్టరుగా
హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరగా
నారీమణులకు వారము యవ్వన
వారక యొసగెడి వారిజాక్షునికి
హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా
హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరగా
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి