రామ కోడండరామ
రామ కళ్యాణ రామ
భైరవి రాగం, ఆది తాళం
Audio
పల్లవి :
రామ కోడండరామ ---రామ కళ్యాణ రామ...4
చరణం :
రామ సీతాపతి ---
రామ నీవేగతి
రామ నీకు మ్రొక్కితి --- రామా నీ చేజిక్కితి
రామ నీకెవరు జోడు ---రామ క్రీగంట చూడు
రామ నేను నీవాడు--- రామ నాతో మాటాడు
రామ నామమే మేలు--- రామా చింతనే చాలు
రామ నీవు నన్నేలు ---రామ రాయుడే చాలు
రామ నీదొక్క మాట ---రామ నాదొక్క మూట
రామ నీ పాటే పాట ---రామ నీబాటే బాట
రామ నేనెందైనను ---
రామ వేరెంచలేను
రామ ఎన్నడైనను ---
రామ బాయగలేను
రామ విరాజ రాజ---
రామ ముఖజిత రాజ
రామ భక్త సమాజ ---
రక్షీత త్యాగరాజ
రామ కోదండరామ--- రామ కళ్యాణ రామ...4
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి