2, డిసెంబర్ 2016, శుక్రవారం

కువలయ దళ నయనా - Kuvalaya Dala Nayanaa

కువలయ దళ నయనా ఆదితాళము ,నాటకురంజి రాగం


పల్లవి :
కువలయ దళ నయనా బ్రోవవే
కుంద కూట్మల రధనా
కువలయ దళ నయనా

చరణం :
మమత మించి నీదు పైని
మరులు కొన్న నేనెందు బోదూ
కువలయ దళ నయనా

మనసు తెలిసి నీవు నన్ను
మరచి మరువ నట్లున్నావు
కువలయ దళ నయనా

దేవ శిరోమణివి నీవనుచును
ఏ వేళ మదిని పాడుచుంటి
కువలయ దళ నయనా

అన్య మతము లెరుగా శ్రీరాజన్య
భజన సేసితి మది కరగ
కువలయ దళ నయనా

బుద్ది నొసగు త్యాగరాజుని వద్ద నిలిచి పూజ గొనుము బాగా
కువలయ దళ నయనా...బ్రోవవే కుంద కూట్మల రధనా…..

కువలయ దళ నయనా...3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి