సకల లోకేశ్వరులు
రతిపతిప్రియ రాగం
ఖండగతి తాళం
గానం : శ్రీమతి విద్యాభారతిగారు
పల్లవి :
సకల లోకేశ్వరులు సరస చేకొను వాడు
అకలంకముగా పుష్ప యాగంబు
చరణం :
వివిధ మంత్రములతో వేదఘోషములతో
అవల తిరువా ముడియు అంగనల కాంతితో
కవి వంది నుతులతో కమ్మ పూజల తోడ
నవధరించి పుష్పయాగంబు
……..సకల లోకేశ్వరులు…….
కర్పురటారతులు ఘన చందనము తోడ
తెప్పల ధూపముల తిరు వంది కాపుతో
ఓప్పు పణ్యారములు వొగి పెక్కు వగలతో
అప్పడందీ పుష్పయాగంబు
……..సకల లోకేశ్వరులు ….
తగు ఛత్ర చామరా తాంబులములతోడ
పగటుతో నీరీతి పది పూజలందుకొని
జిగిమీరె చూడరే శ్రీవేంకటేశ్వరుని
అగణితంబగు పుష్పయాగంబు
సకల లోకేశ్వరులు సరస చేకొను వాడు
అకలంకముగా పుష్పయాగంబు
పుష్పయాగంబు పుష్పయాగంబు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి