7, జనవరి 2017, శనివారం

పూజలందరు చేసేదే పుష్పయాగము

పూజలందరు చేసేదే పుష్పయాగము
ఏకతాళం  ,  హంసరాగం

పూజలందరు చేసేదే పుష్పయాగము యాజి
నర్జనుడు చేసినదే పుష్పయాగము

మొదల శ్రీ సతి చేతి  మోహన కమలమే
పోదలనీకెపుడునూ పుష్పయాగము
గుదిగొన మిమ్మిద్దరిని గూడించే మరువిరుపొదిగి పూజించిన పుష్పయాగము
పొదిగి పూజించిన పుష్పయా...గము
…...పూజలందరు…...
మాలాకారుండిచ్చిన మధురలో పూదండ
పోలింప నీకు నదే పుష్పయాగము
కేలితో నారదుడు వొసగిన పారిజాతము
భులోకమున నీకు పుష్పయాగము
భులోకమున నీకు పుష్పయా...గము
…..పూజలందరు…...
తొరలి అలమేల్మంగ తురుమున విరులే నీకు
పొరసి నీ ఉరముపై పుష్పయాగము
సిరులతో మునులెల్ల శ్రీవేంకటాద్రీశ
పొరిపొరి జేసేరు నీకు పుష్పయాగము.పొరిపొరి జేసేరు నీకు పుష్పయా..గము.
పూజలందరు చేసేదే పుష్పయాగము యాజి నర్జునుడు చేసినదే పుష్పయాగము
పూజలందరు చేసేదే పుష్పయాగము..,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి