రామరామ నీవారము
త్యాగరాజస్వామి దివ్యనామ సంకీర్తన
ఆనందభైరవి రాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
రామరామ నీవారము గామా రామ
సీతా,
రామరామ సాధుజన ప్రేమ రారా
మెరుగు చేలము గట్టు కొని మెల్ల రారా రామ
కరకు బంగారు సొమ్ములు కదల రారా
వరమైనట్టి భక్తాభీష్ట వరదా రారా రామా
మరుగు చేసుకొను నట్టి మహిమ రారా
మెండైన కోదండ కాంతి మెరయ రారా రామ
కన్నుల పండుగ ఉండు ఉద్ధండ రారా
చిరునవ్వు గల మోమును చూపరా రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా
కందర్ప సుందరానంద కందరా రారా రామ
వందనము చేసెద గోవిందా రారా
ఆద్యంత రహిత వేద వేద్యరారా రామ
భవ వేద్య నేనీవాడనే వేగరారా
సుప్రసన్న సత్యరూప సుగుణరారా రామ
అప్రమేయ త్యాగరాజు నేలరారా
రామరామ నీవారము గామా రామ
సీతా,
రామ రామ సాధుజన ప్రేమరారా
, రామ రామ సాధుజన ప్రేమరారా
రామారామ సాధుజన ప్రేమరారా
రామారామ సాధుజన ప్రేమరారా
రామారారా….ప్రేమారారా…. ఆ..ఆ………..,,..................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి