19, జనవరి 2017, గురువారం

O rama o rama omkara dhama ఓరామ ఓరామ ఓంకార ధామ

ఓరామ ఓరామ ఓంకార ధామ
అరభి రాగం, ఆది తాళము


పల్లవి :
ఓరామ ఓరామ ఓంకార ధామ
ఓరామ ఓరామ ఒనరింతు ప్రేమ


చరణం :
నామేలునందరు నవ్వుటకాయె
ఏమని తలుతు నిక దేవరాయ


నిన్నెంచినందుకు నయమేమి కలిగే
నిన్నే నెర నమ్మితి నీవే నా సరిగా


ధరలోన రక్షా కర్తలు లేరు దేవ
మరచితే వెరచితే మాకేమి దోవ


నీకాశించితిగాని నిమిషాము మాన
ఏకమై నన్నేలు కోకుంటే ఆన


నీ కంటే దొరకునా నిరుపామ గాత్రా
పరాకేల శ్రీ త్యాగరాజుని మిత్రా
పరాకేల శ్రీ త్యాగరాజుని మిత్రా…..3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి