7, జనవరి 2017, శనివారం

సీతాదేవి గొబ్బియళ్ళో

సీతాదేవి గొబ్బియళ్ళో


పల్లవి :
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళో
సీతాదేవి వాకిట వేసిన గొబ్బియళ్ళో
మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియళ్ళో


చరణం
మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియళ్ళో
ఆ మగ్గులు మీద మల్లెపూలు గొబ్బియళ్ళో
నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియళ్ళో
ఆ ముగ్గుల మీద మొగలీపూలు గొబ్బియళ్ళో
…..గొబ్బియళ్ళో….


రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బియళ్ళో
ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియళ్ళో
ధాన్యపు రాశుల ముగ్గులు వేసి గొబ్బియళ్ళో
ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియళ్ళో
…...గొబ్బియళ్ళో…


భూదేవంత ముగ్గులు వేసి గొబ్బియళ్ళో
ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియళ్ళో
లక్ష్మీ రధముల ముగ్గులు వేసి గొబ్బియళ్ళో
ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బియళ్ళో
……...గొబ్బియళ్ళో….…...


ముంగిట ముగ్గులు వేసి గొబ్బియళ్ళో
ఆ ముగ్గుల్లో పొంగళ్ళు గొబ్బియళ్ళో
భోగి పండ్ల సందళ్ళు గొబ్బియళ్ళో
అహా మరదళ్ళ సరదాలు గొబ్బియళ్ళో


గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళో
సీతాదేవి వాకిట వేసిన గొబ్బియళ్ళో
మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియళ్ళో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి