7, జనవరి 2017, శనివారం

వేదమాత దీవెనలంది vedamata devenalandi

వేదమాత దీవెనలంది ఆదితాళము
గానం :ప్రణవి మొక్కరాల
Audio
పల్లవి :
వేదమాత దీవెనలంది చిరంజీవిగా వర్ధిల్లు
ఆదిఋషుల అమృతవాక్కులు నీ మనుగడగా రాజిల్లు
ఉపనయనపు పెండ్లికుమారా ఉజ్వల భవితకు స్వాగతం
అప్సర కాంతలు హారతులెత్తి ఆశిస్సులునిచ్చే సమయం
ఆశిస్సులునిచ్చే సమయం

చరణం :
సూర్య తేజమే నీ నొసట,  తిలకముగా మెరవాలి
చలువలరేడే నీ కన్నులలో వెన్నెల కాంతులు నింపాలి
రాగం త్యాగం ఆభరణాలై నిరతము నిన్నలరించాలి
చక్కని నడవడికతో సాగి అందరి మన్ననలందాలి
….వేదమాత దీవెనలంది ….

కన్నతండ్రి కర్ణపేయముగా ఉపదేశించే మంత్రమిది
నీ ఎదలో జ్ఞానదీపికలు వెలిగించే సుముహూర్తమిది
ఆనందముగా అందరంమొక్కటై  కలసిన మంగళ వేడుకిది
పెద్దల పిన్నల బంధుమిత్రుల శుభాకాంక్షల తరుణమిది
…..వేదమాత దీవెనలంది ….

ఆనందమానందమాయెనే మా సాయిశరణ్ వడక పెండ్లికొడుకాయెనే
ఆనందమానందమాయెనే మా సాయిశరణ్ వడక పెండ్లికొడుకాయెనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి