ఎంత మధురమో
కానడ రాగం, ఆది తాళం
గానం : సుధాగారు
పల్లవి :
ఎంత మధురమో శ్రీసాయి నామము
ఇంత వరకు ఎరుగమైతిమి ఇంత మధురమని
……...ఎంత మధురమో …..
చరణం :
ఎంత పాడుకున్నను సమయమే తెలియదు
ఎంత గ్రోలుకున్నను తనివే తీరదు
సాయి అనినంత తనువు ఊగిపోతున్నది
సాయి అనినంత మనసు నాట్యమాడుతున్నది
……..ఎంత మధురమో…..
విలువ కట్టి చెప్పుటకు వీలుకాని రత్నమిది
ఏ జన్మ పుణ్యమో మనకు లభ్యమయినది
ఇల దాస కోటిలో ప్రతిధ్వనించు నామము
కలనైన మరువలేని కమనీయ నామము
ఎంత మధురమో శ్రీసాయి నామము
ఇంత వరకు ఎరుగమైతిమి ఇంత మధురమని
……...ఎంత మధురమో …..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి