29, జనవరి 2017, ఆదివారం

Vidyulallika lallina విద్యులల్లిక లల్లిన

గణతంత్ర మహోత్సవము సాంగ్


విద్యులల్లిక లల్లిన
గానం : మోచర్ల సుధావల్లిగారు


విద్యులల్లిక లల్లిన పల్లెల వాకిళ్ళు
వింత జతుల వెల్లి విరియ చల్లని ముంగిళ్ళు….2
వెన్నులపై తిన్నుమీరు విశృత నాట్యాలు
కలువల పందిర్లు వేసే చిలుకల లాస్యాలు
ఆనందం వెల్లి విరిసే ఎల్లెడలా నేడు
గణతంత్ర మహోత్సవ శుభ దివసం మీనాడు


ఒప్పులగుప్పల లాడే వయ్యారంబు  భామలు
కర్పూరపు హారతి గొని వచ్చిరి వేమలు
భారత భువి దివియై ఇక వర్ధిల్లు వసంతం
బాపు తన హర్షాక్షత యెల్లన జల్లేరు
ఆనందం వెల్లి విరిసే ఎల్లెడలా నేడు
గణతంత్ర మహోత్సవ శుభ దివసం మీనాడు


కన్నీరే పన్నీరై వర్షించెను నేడు
ఎన్నో కష్టాల ఫలము ఇల చేరనదీనాడు
ఆనందం వెల్లి విరిసే ఎల్లెడలా నేడు -ఎల్లెడలా నేడు …...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి