హరి నామము
జోన్ పూరి / నాగ గాంధారి రాగం ,ఆది తాళం
అన్నమయ్య సంకీర్తన,
గానం :శ్రీమతి మొక్కరాల కామేశ్వరీ గారు
పల్లవి :
హరి నామము కడు ఆనంద కరము…
హరి నామము కడు ఆనంద కరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరి నామము కడు ఆనంద కరము…
చరణం :
నళినాక్షుని శ్రీ నామము
కలిదోష హరము కైవల్యము
ఫలసారము బహు బంధమోచనము
తలచవో తలచవో తలచవో…..
తలచవో తలచవో తలచవో మనసా
……...హరి నామము …….
నగధరు నామము నరక హరణము
జగదేక హితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో…….
పొగడవో పొగడవో పొగడవో మనసా
………...హరి నామము……..
కడగి శ్రీ వేంకటపతి నామము
బడిబడినే సంపత్కరము
అడి అలంబిల అతి సుఖ మూలము
తడవవో తడవవో తడవవో ….
తడవవో తడవవో తడవవో మనసా
హరి నామము కడు ఆనంద కరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరి నామము కడు ఆనంద కరము....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి