7, జనవరి 2017, శనివారం

రాముడు రాఘవుడు

రాముడు రాఘవుడు
ఆది తాళము,  కానడ రాగము
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు.


రాముడు రాఘవుడు రవికులుడితడు
భుమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు…...ఉ..ఉ..ఉ..ఉ..


అరయ పుత్ర కామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము
రాముడు రాఘవుడు రవికులుడితడు…...ఉ..ఉ..ఉ..ఉ..


చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి
కాంతుల చెన్నుమీరిన కైవల్య పదము
రాముడు రాఘవుడు రవికులుడితడు…...ఉ..ఉ..ఉ..ఉ..


వేదవేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్ధము
పోదితో శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన
ఆదికి అనాది అయిన అర్చావతారము


రాముడు రాఘవుడు రవికులుడితడు
భుమిజకు పతియైన పురుష నిధానము

రాముడు రాఘవుడు రవికులుడితడు…...ఉ..ఉ..ఉ..ఉ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి