ఒడుగు మంగళం పాట
మంగళం వటువునకు మార్తాండ తేజునకు
మంగళం సర్వాంగ మహినందనునికి
మంగళం త్రైలోక్య సంచారవాసునకు
మంగళం ఈ బ్రహ్మచారికిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం...2
జాత కర్మా నామ చెవులన్నప్రాసన
శ్రీ శాస్త్ర ఉదకములు శిఖలునుంచి
ప్రీతితో యజ్ఞోపవీతమ్ము ధరియించె
శాస్త్రవిధి బ్రహ్మచారి ఇపుడు
జయమంగళం నిత్య శుభమంగళం..2
రంగు బంగారంబు ఉంగరం వేలికుంచి
సమ్మతిగ కంకణం చేతగట్టి
గంగ ఉదకముతోను గాయత్రి మంత్రమును
గుంభనముగా తండ్రి చెప్పె తరుణం
జయమంగళం నిత్య శుభమంగళం..2
భవతి భిక్షాందేహి అనగా వటువు
ప్రధమముగా భిక్షను పెట్టె తల్లి
దీవించే పుత్రుని దీర్ఘాయు కమ్మని
వేగిరమే కళ్యాణ మొందుమనెను “/”
దీవించే పుత్రుని దీర్ఘాయు కమ్మని
చదువు సంస్కారములె తోడుగాను
జయమంగళం నిత్య శుభమంగళం...2
బాలునికి భిక్షంబు వేయగా బంధువులు
అరిశెలతో మరి చక్కిలాలతోను
అక్షింతలతో ఆణిముత్యాలతో స్త్రీలు
మంగళంబనుచును పాడగాను
జయమంగళం నిత్య శుభమంగళం..4
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి