8, ఫిబ్రవరి 2017, బుధవారం

Anuvanuvuna hari nadam అణువణువునా హరినాదాం గోదాదేవి పాశురం-07

గోదాదేవి పాశురం-07
రచన : పి.యల్.యన్. ప్రసాదుగారు
సంగీతం,  గానం : యం. యశోధరగారు
భూపాలరాగం


అణువణువునా హరినాదం అలరించెను చూడమని
పల్లెయే పలవరించే మేలుకొని వినుము సఖి
….అణువణువునా హరినాదం…..ఆ...ఆ...ఆ…..ఆ...ఆ…..


రేయంతా రెచ్చినా పోరులే సలిపినా
కొక్కొరోకోయని తొలిపొద్దు లేచెనె కోళ్ళు
ఆలమందల అరుపులు పాలకావిళ్ళ చప్పుళ్ళు
నిలువు కడవళ్ళ చిలుకుళ్ళు అవిగో నీరజాక్షుని కళ్ళు
అవిగో నీరజాక్షుని కళ్ళు……
…..అణువణువునా……….


గాజులు గలగల లాడెనే అతివల అందెల మ్రోగెనే
కిలకిల నవ్వుల రాగాలు కృష్ణుని కొంటె సరాగాలు
వినివేగా లేచి రావే వినివేగా లేచి రావే మేలుకొనవే మానినీ మేలుకొనవే మానినీ

…..అణువణువునా……..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి