పాశురం-9
మేలుకొనవే మరుమల్లె
రచన : డా.పి.యల్.యన్.ప్రసాదుగారు
గానం,సంగీతం:యం.యశోధరగారు
శంకరాభరణరాగం
Audio
మేలుకొనవే మరుమల్లె మేలుకొనవే..2
మురిపాల మాధవుని మహిలోన కనవే
….మేలుకొనవే ..
దీపాలు ధూపాలు పందిరి మంచాలు పట్టుదుప్పట్లు పరువాల కలలు
కలలోనే క్రిష్ణుని ముచ్చట్ల తోడ
కలవరించేవే కులుకులా కామాక్షి
కాకికి కబురెట్టి కనురెప్ప మూయవే
కోడితో చెలరేగి తొలిజాము నిలువవే
అత్తలే అరచిన అతివ నువ్వు నవ్వేవు
అదిరేటి చప్పుళ్ళు నీను లేపలేవా
….మేలుకొనవే మరుమల్లె….
వీనుల వినరాదు వింతకాదా మాయలే కమ్మేనా మదిరాక్షి నిన్ను
మంత్రాలు మాయలే కమ్మినా కాని మాయదారి మాధవుడు వీడే మనకేమి భయము
కన్నయ్య కొలువుండే కన్నెలారా
కొంగు బంగారమునే కొంగునా కట్టరే
మేలుకొనవే మరుమల్లె మేలుకొనవే
మురిపాల మాధవుని మహిలోన కనవే
మేలుకొనవే మరుమల్లె మేలుకొనవే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి