8. గోదాదేవి పాశురం
కేశవుడాడిన
రచన :డా.పి.యల్.యన్.ప్రసాదుగారు
గానం, సంగీతం,: యం.యశోధరగారు
హమీర్ కళ్యాణి రాగం
Audio
కేశవుడాడిన వనసీమలవియే
కేశినే మర్ధించు రణ క్రీడలివిగో
మోహనాకారుడే మోహింప రావే
మత్తు వదలవే మీనాక్షీ నీవు
…..కేశవుడాడిన….
పాడి పశువుల తోడు పరిగెత్తె హరిని
యమునలో మునిగి యాదవుల కూడి
చానూర ముష్టికుల సంహరించిన ఆనీల మేఘుని నీ వాకిట నిలిపేము
మేము నీవాకిట నిలిపేము
…….కేశవుడాడిన……
హరి మనసునే గెలిచి హరిని చేపట్ట
మార్గళీ నోములే మనకిక మార్గంబు
కాత్యాయని కరుణ కన్నెలేె పొందగా లోకాలకిదే సౌభాగ్యదాయకం కన్నెలందరికి కళ్యాణ కారకం…
...కేశవుడాడిన…...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి