28, ఫిబ్రవరి 2017, మంగళవారం

Endukaya sambhasiva ఎందుకయా సాంబశివ


ఎందుకయా సాంబశివ
ఏకతాళం , మాయ మౌళవ గౌళ రాగం
రచన :దేవులపల్లి క్రిష్ణశాస్త్రీగారు
Audio
పల్లవి :
ఎందుకయా సాంబశివ……
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా…..2
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ

చరణం :
అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి...2
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగా పెట్టి
ఎందుకయా సాంబశివ…….నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగా పెట్టి
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ

తోలు కట్టి పటకాగా కాలాగ్ని కుట్టి...2
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివ…….
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ

రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర...2
ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా
ఎందుకయా సాంబశివ…..
ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా…..2
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ
సాంబశివ సాంబశివ ...సాంబశివ సాంబశివ

1 కామెంట్‌: