హెచ్చరికగా రారా
హే రామచంద్ర
ఉత్సవ సాంప్రదాయ త్యాగరాజ కీర్తన
యదుకుల కాంభోజి రాగం,
ఖండచాపు తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
హెచ్చరికగా రారా , హే రామచంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర
అను పల్లవి :
పచ్చవిల్తుని గన్న పాలిత సురేంద్ర..2
హెచ్చరికగా రారా హే రామచంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర
చరణం :
కనక మయమౌ మకుట కాంతి మెరయగను
ఘనమైన కుండల యుగంబు కదలగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను
సనకాదులెల్లగని సంతసిల్లగను
…..హెచ్చరికగా రారా……
ఆణి ముత్యాల సరులల్లలాడగను
వాణీ పతీంద్రులిరు వరస పొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణ పలుకుల వినుచూ వేడ్క చెల్లగను
…….హెచ్చరికగా రారా…….
నిను చూడ వచ్చు భగిని కరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను పలుక
మిను వాసులెల్ల విరులను చాల చిలుక
ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక
…...హెచ్చరికగా రారా….పల్లవి పూర్తిగా.
హెచ్చరికగా రారా , హే రామచంద్ర
ఓ రామచంద్ర. హే రామచంద్రAudio
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి