16, మార్చి 2017, గురువారం

Meluko dayanidhi మేలుకో దయానిధి

మేలుకో దయానిధి

మేలుకొలుపు పాట
సౌరాష్ట్ర రాగం, రూపక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు
త్యాగరాజ స్వామి కీర్తన
ఉత్సవ సంప్రదాయ కీర్తనలు

పల్లవి :
మేలుకో దయానిధి మేలుకో ధాశరధి
మేలుకో దయానిధి  మిత్రోదయమౌ వేళ
మేలుకో దయానిధి…….

చరణం :
వెన్న పాలు బంగారు గిన్నెలోనే ఉంచినాము
తిన్నగారగించి తేట కన్నులతో నన్ను బ్రోవ
మేలుకో దయానిధి……..

నారదాది మునులు సురలు వారిజభవుడిందు కళాధారులు
నీ సన్నిధిలో కోరి కొలువ గాచినారు
మేలుకో దయానిధి…

రాజ రాజాది దిగ్రజులెల్ల వచ్చినారు
రాజనీతి తెలియ త్యాగరాజ వినుత నన్ను బ్రోవ

మేలుకో దయానిధి….పల్లవి పూర్తిగా.మేలుకో దయానిధి,
మేలుకో దయానిధి,
దయానిధి, దయానిధి…...Audio

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి