కమ్మని ఈ ఉగాది వేళ
మోహనరాగం ,ఆదితాళం
సంగీతం : ప్రణవి మొక్కరాల
రచన , గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
కమ్మని ఈ ఉగాది వేళ జీవితమే ఆనందహేల
కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతమే చెప్పేటి వేళ
….కమ్మని ఈ ఉగాది వేళ…..
చరణం :
కోయిల పాటల రవళులు ఉగాది పచ్చడి షడ్రుచులు
పంచాంగ తిధులు రాశిఫలాలు కలసి మెలసిన ఉగాది వేళ
జీవితమే ఆనందహేల ….జీవితమే ఆనందహేల
కమ్మని ఈ ఉగాదివేళ….
మిరప వేప ఉప్పు మామిడి చెఱుకు చింత బెల్లపు రుచులు
కలిమిలేములు కష్టసుఖాలు కలసి మెలసిన ఉగాది వేళ
….జీవితమే ఆనందహేల ….జీవితమే ఆనందహేల
కమ్మని ఈ ఉగాదివేళ….
సాంప్రదాయపు దుస్తులు బంధుమిత్రులు శుభాకాంక్షలు
రంగులముగ్గులు పిండివంటలు కలసిమెలసిన ఉగాదివేళ
…..జీవితమే ఆనందహేల….జీవితమే ఆనందహేల
కమ్మని ఈ ఉగాదివేళ….
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి