25, మార్చి 2017, శనివారం

Ku u ku u kuyani kokila koosindi కూ..ఊ..కూ..ఊ..కూవూయని కోకిల కూసింది

కూ..ఊ..కూ..ఊ..కూవూయని కోకిల కూసింది
రచన : పి.యస్.గోపాల్
సంగీతం : పి.యస్.ప్రభాకర్ గారు గానం : మోచర్ల సుధావల్లి గారు


పల్లవి :
కూ..ఊ..కూ.ఊ...కూ..ఊయని కోయిల కూసింది
చిగురే పూవై,  పూవే పిందై కోర్కెలు నిండాలి
చిరకాలంగా ఎదలో కదిలే కలలే పండాలి కలలే పండాలి
కూ..ఊ..కూ.ఊ...కూ..ఊయని కోయిల కూసింది


చరణం :
వసంతకాలపు శుభసమయం లో వలపుల తేటులు పాడాయి
అనంత కాలపు ఆనందాన్ని ఆమనిగా అర్పించాయి.
కూ..ఊ..కూ.ఊ...కూ..ఊయని కోయిల కూసింది


కొమ్మలు రెమ్మలు కోటి పూలతో కొదమ తుమ్మెదను పిలిచాయి
ఝుమ్ము ఝుమ్మనుచు తుమ్మెద కొదములు ఇమ్ముగ గానం చేశాయి ఇమ్ముగ గానం చేశాయి
కూ..ఊ..కూ.ఊ...కూ..ఊయని కోయిల కూసింది


రమ్ము రమ్మనుచు పూల కన్నియలు రమణీయంగా పిలిచాయి
సన్నాయి పాటల సరాగ మాలల సొగసులనదే వర్షించాయి
కూ..ఊ..కూ.ఊ...కూ..ఊయని కోయిల కూసింది


సొగసుల చాటుల కన్నెపిల్లల కోరికలీరిక లెత్తాయి
చిలిపి చిలిపిగా పెదవుల నగవులు చిలకలనే మురిపించాయి
కూ..ఊ..కూ.ఊ...కూ..ఊయని కోయిల కూసింది


వసంతకాలం వచ్చింది  వలపుల దొంతర తెచ్చింది
వయ్యారి కన్నెల సరాగాలతో మయూరి నాట్యము చేసింది మయూరి నాట్యం చేసింది.
కూ..ఊ..కూ.ఊ...కూ..ఊయని కోయిల కూసింది
కోయిల కూసింది

కోయిల కూసింది

1 కామెంట్‌:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి