15, ఏప్రిల్ 2017, శనివారం

దేవికిదే పూజ పాదపూజ | Devikide Pooja Pada Pooja

దేవికిదే పూజ పాదపూజ
వసంతరాగం, ఆది/ఏక తాళం
సంగీతం : ప్రణవి మొక్కరాల
గానం : మొక్కరాల కామేశ్వరీగారు
దేవికిదే పూజ పాదపూజ
మంచి మనస్సుతో చేసే మల్లెల పూజ

కలకాలము దేవికి కనకాంబరమాల
చేయి వదల రాదని చేమంతులమాల
మోహక్షయకారిణికి మొగలిపూలమాల
దయతలిచే తల్లికి దవనపుమాల
దేవికిదే పూజ పాదపూజ

గుండెలోన దేవికి గులాబీలమాల
సర్వాంతర్యామికి సంపెంగలమాల
మమతల మాతల్లికి మాలతీమాల
ప్రేమైక్య మూర్తికి పొన్నమాల
దేవికిదే పూజ పాదపూజ

నాదస్వరూపిణికి నాగమల్లెమాల
మందస్మిత వదనకు మందారమాల
తీయని పలుకుల తల్లికి తులసీదళమాల
మనసెరిగిన తల్లికి మరువపుమాల
దేవికిదే పూజ పాదపూజ

చల్లని చూపల తల్లికి చంపకమాల
కరుణాలవాలకి కమలపూలమాల
కలిదోషహారిణికి కలవపూల మాల
సుగుణాల రాశికి సన్నజాజి మాల
దేవికిదే పూజ పాదపూజ

దేవికిదే పూజ పాదపూజ
మంచి మనస్సుతో చేసే మల్లెల పూజ
దేవికిదే పూజ పాదపూజ...పాదపూజ...పాదపూజ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి