15, ఏప్రిల్ 2017, శనివారం

రంగ రంగ రంగపతి | Ranga Ranga Rangapati

రంగ రంగ రంగపతి
సింధుభైరవి రాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

పల్లవి :
రంగ రంగ రంగపతి రంగనాధా..నీ
సింగారాలె తరచాయ శ్రీరంగనాధా
రంగ రంగ రంగపతి రంగనాధా..నీ
సింగారాలె తరచాయ శ్రీరంగనాధా….2
రంగ రంగ రంగపతి రంగనాధా..ఆ..ఆ...

చరణం :
పట్టపగలే మాతో పలచగా నవ్వేవు
ఒట్టులేల పెట్టుకొనేవో రంగనాధా
వట్టి మాకు లిగిరించు వడి నీ మాటలు వింటే
రట్టడవి మేర మీరకు రంగనాధా రంగనాధా….శ్రీరంగనాధా
రంగ రంగ రంగపతి రంగనాధా..ఆ..ఆ...

కావేరి రంగమున కాంతపై పాదాలు  చాచి
రావు పోవు ఎక్కడికి రంగనాధా..శ్రీ
వేంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి
ఏవల చూచిన నీవే ఇటు రంగనాధా
  రంగనాధా శ్రీరంగనాధా        

రంగ రంగ రంగపతి రంగనాధా….నీ
సింగారాలె తరచాయ శ్రీరంగనాధా..2
రంగ రంగ రంగపతి రంగనాధా..ఆ..ఆ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి