23, జూన్ 2017, శుక్రవారం

Nanati batuku నానాటి బతుకు

నానాటిి బతుకు
రేవతిరాగం , ఆదితాళం
సంగీతం : నేదునూరి క్రిష్ణమూర్తిగారు
గానం : మొక్కరాల కామేశ్వరీగారు

Audio
పల్లవి :
నానాటి బతుకు నాటకము
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము

చరణం :
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము
యెట్ట నెదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము

కుడిచే దన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము
ఒడిగట్టుగొనిన ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము

నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము
నాటకము నాటకము

14, జూన్ 2017, బుధవారం

Puttina roju pata(sanskrit lo) పుట్టినరోజు పాట (సంస్కృతం లో)

Audio
పుట్టినరోజు పాట
సంస్కృతం లో

జన్మదిన మిదం అయి ప్రియ సఖే(గురో)
శంతనోతుతే సర్వదా ముదమ్

ప్రార్ధయా మహే భవ శతాయుషి
ఈశ్వరః సదా త్వాం చ రక్షతు

పుణ్య కర్మణా కీర్తి మర్జయ
జీవనం తవ భవతు సార్ధకమ్

Tandanahi తందనానాహి

Audio
తందనానాహి
మాయ మాళవ గౌళ రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానాహి తందనానాపురే తందనాన భళా తందనాన భళాతందనాన భళాతందనాన
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానాహి తందనానాపురే తందనాన భళా తందనాన భళాతందనాన భళాతందనాన

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతు కులమింతా నొక్కటే
అందరికి శ్రీహరే అంతరాత్మ
హరేఅంతరాత్మ శ్రీహరే అంతరాత్మ
తందనానాహి తందనానాపురే తందనాన భళా తందనాన భళాతందనాన భళాతందనాన

నిండార రాజు నిద్రించు నిద్రయు యొకటే
అండనే బంటు నిద్ర అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
చండాలుడుండెడి సరిభూమి యొక్కటె
ఈ సరిభూమియొక్కటె ఈ సరిభూమి యొకటె
తందనానాహి తందనానాపురే తందనాన భళా తందనాన భళాతందనాన భళాతందనాన

కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండకటే
కడు పుణ్యులను పాప కర్ములను సరిగావ
ఝడియు శ్రీ వెంకటేశ్వరుని నామమొకటె
ఈశ్వరు నామ మొకటే ఈశ్వరు నామ మొకటే
తందనానాహి తందనానాపురే తందనానభళా తందనాన భళాతందనాన
భళా తందనాన భళా తందనాన  

A tirugu nanu ఏ తీరుగ నను

ఏ తీరుగా నను దయ చూచెదవో
రామదాసు కీర్తన
నాదనామక్రియ రాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

పల్లవి :
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇన వంశోత్తమ రామ
నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామ

చరణం :
శ్రీ రఘునందన సీతారమణ శ్రిత జన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామ

మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెలిపితి రామ
మరువక ఇక అభిమానముంచు నీ మరుగు జొచ్చితిని రామ

కృర కర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామ
దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామ

వాసవ కమల భవామర వందిత వారధి బంధన రామ
భాసుర వర సద్గుణములు గల్లిన భద్రాద్రీశ్వర  రామ

వాసవనుత రామదాస పోషక వందన మయోధ్య రామ
దాసార్చిత నా కభయమొసంగవే దాశరధి రఘురామ

ఏ తీరుగ నను దయ చూచెదవో ఇన వంశోత్తమ రామ
నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామ
నళిన దళేక్షణ రామ …. నళిన దళేక్షణ రామ….

Audio