ఏ తీరుగా నను దయ చూచెదవో
రామదాసు కీర్తన
నాదనామక్రియ రాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇన వంశోత్తమ రామ
నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామ
చరణం :
శ్రీ రఘునందన సీతారమణ శ్రిత జన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామ
మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెలిపితి రామ
మరువక ఇక అభిమానముంచు నీ మరుగు జొచ్చితిని రామ
కృర కర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామ
దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామ
వాసవ కమల భవామర వందిత వారధి బంధన రామ
భాసుర వర సద్గుణములు గల్లిన భద్రాద్రీశ్వర రామ
వాసవనుత రామదాస పోషక వందన మయోధ్య రామ
దాసార్చిత నా కభయమొసంగవే దాశరధి రఘురామ
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇన వంశోత్తమ రామ
నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామ
నళిన దళేక్షణ రామ …. నళిన దళేక్షణ రామ….
Audio
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి