Audio
తందనానాహి
మాయ మాళవ గౌళ రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానాహి తందనానాపురే తందనాన భళా తందనాన భళాతందనాన భళాతందనాన
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానాహి తందనానాపురే తందనాన భళా తందనాన భళాతందనాన భళాతందనాన
కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతు కులమింతా నొక్కటే
అందరికి శ్రీహరే అంతరాత్మ
హరేఅంతరాత్మ శ్రీహరే అంతరాత్మ
తందనానాహి తందనానాపురే తందనాన భళా తందనాన భళాతందనాన భళాతందనాన
నిండార రాజు నిద్రించు నిద్రయు యొకటే
అండనే బంటు నిద్ర అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
చండాలుడుండెడి సరిభూమి యొక్కటె
ఈ సరిభూమియొక్కటె ఈ సరిభూమి యొకటె
తందనానాహి తందనానాపురే తందనాన భళా తందనాన భళాతందనాన భళాతందనాన
కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండకటే
కడు పుణ్యులను పాప కర్ములను సరిగావ
ఝడియు శ్రీ వెంకటేశ్వరుని నామమొకటె
ఈశ్వరు నామ మొకటే ఈశ్వరు నామ మొకటే
తందనానాహి తందనానాపురే తందనానభళా తందనాన భళాతందనాన
భళా తందనాన భళా తందనాన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి