Bbhagyala lakshmi
భాగ్యాలా లక్ష్మి
శ్రీరాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
భాగ్యాల లక్ష్మీ రావమ్మా…..
భాగ్యాల లక్ష్మీ రావమ్మా
మాయమ్మా శ్రీ సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మా
మాయమ్మా శ్రీ సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మా
చరణం :
నుదుట కుంకుమ రవి బింబముగా
కన్నుల నిండుగా కాటుక మెరయ
కాంచన హారము గళమున మెరయ
పీతాంబరములు శోభతో నిండుగా
...భాగ్యల లక్ష్మీ రావమ్మా….
నిండుగ కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదంబుల మువ్వలు
ఘల్లు ఘల్లుమని సవ్వడి సేయగా
సౌభాగ్యవతుల సేవల నొందగ
…..భాగ్యాల లక్ష్మీ రావమ్మా….
భాగ్యములిచ్చు బంగరు తల్లి
పురంధర విఠలుని పట్టపు రాణి
శుక్రవారము పూజల నొందగా
సాయంకాలపు శుభఘడియలలో
శుక్రవారము పూజల నొందగా
శ్రావణమాసపు శుభఘడియలలో
భాగ్యాల లక్ష్మీ రావమ్మా
మాయమ్మా శ్రీ సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మా
వరలక్ష్మి రావమ్మా……
శ్రీలక్ష్మీ రావమ్మా….
జయలక్ష్మీ రావమ్మా...
ఇన్నాళ్ళు కన్నడ భాషలో మాత్రమే విన్న పురందరదాసుని కీర్తనని చక్కని తెలుగులో అదే రాగంలో, అదే భావంతో అందించారు! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి