19, జులై 2017, బుధవారం

Indivarakshiki ఇందివరాక్షికి

Audio
ఇందివరాక్షికి indivarashiki
ఆనందభైరవిరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

పల్లవి :
ఇందివరాక్షికి కుందరదనకును
బంధుర వదనకు మంగళం
చందురు సోదరి అయిన శ్రీలక్ష్మికి జలనిధి కన్యకు మంగళం

చరణం :
పరమపావనికి పద్మాలయకును
మరు జననికి జయ మంగళం
కరిరాజగమనకు కాంతాలలామకు
కంబు కందరికిని మంగళం

నీరజపాణికి నిఖిలేశ్వరికిని
నిగమ సన్నుతకునూ మంగళం
వారణ సేలమునకు వేంచేసిన
వరదుని రాణికి మంగళం

ఇందివరాక్షికి కుందరదనకును
బంధుర వదనకు మంగళం
బంధుర వదనకు మంగళం
శ్రీజయలక్ష్మికి మంగళం
సౌభాగ్యలక్ష్మికి మంగళం….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి