20, జులై 2017, గురువారం

Enta chakkani danavamma ఎంత చక్కని దానవమ్మా

Enta chakkanidanavamma
ఎంతచక్కని దానవమ్మ
శ్రావణ వరలక్ష్మీ పాట
శ్రీరాగం / ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :

ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మీ
మంగళహారతి గైకొనవమ్మ శ్రావణవరలక్ష్మీ

చరణం :
ఎపుడూ అడుగుట యేనా తల్లి
మా ఇంటికి ఒక పరి రావమ్మ
పసుపు కుంకుమలు పూలగాజుల
వాయనమిచ్చి కొలిచేనమ్మ

రీస రీస రిమరీసరి
రిమ పామ పామ పనిపమప
పని సాని సాని సరిసనిసా
గరిసా నీ పా దని పామా రిగరిస ఎంత చక్కని దానవమ్మా…….

కరుణించి సుఫలమ్మునొసంగు
సద్వినియోగం చేసేమమ్మా
నిత్య సుమంగళిగా దీవించు
నిరతము నిను సేవించేమమ్మా

రీస రీస రిమరీసరి
రిమ పామ పామ పనిపమప
పని సాని సాని సరిసనిసా
గరిసా నీ పా దని పామా రిగరిస ఎంత చక్కని దానవమ్మా…….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి