Lakshmi rave ma intiki
లక్ష్మీ రావే మా ఇంటికి
మాయ మాళవ గౌళ రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
లక్ష్మీ రావే మాఇంటికి
క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి
చరణం :
పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము
పంచ బిల్వములు పూర్ణ కలశము
శ్రావణమాసపు శుక్రవారం రంగు రంగుల
రంగవల్లుల ముంగిట మాతా పూజను గొనుమా
అందముగా జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక
మొగిలి పువ్వుల జడనే అల్లి జడకుచ్చులను పెట్టెమమ్మా జలజ లోచనికి ముదముతోను
గుండె మల్లె మొగలిపూలు దండిగా చామంతిపూలు
మెండైన పారిజాతాలు చల్లని గంధము సాంబ్రాణి ధూపము లివిగో చంద్రుని సోదరికి
కదళీ ఫలము నారికేళము మేలైన దానిమ్మ పండ్లు
ఘనముగా కర్జుర పండ్లు పంచభక్ష్యాది పరమాన్నములు నైవేద్యముగా గైకొనవమ్మా
పచ్చని తోరము చేతికి కట్టి చారుమతి కథ ఆలకించి
ముత్తైదువుకే వాయనమిచ్చి సౌభాగ్యములు సంతోషములు నీకృపతోనే పొందెదమమ్మా
లక్ష్మీ రావే మాఇంటికి
క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి
లక్ష్మీ రావే మాఇంటికి ...రావే మా ఇంటికి...రావే మా ఇంటికి...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి