Lakshmi ne padamu
లక్ష్మీ నీ పాదము
మోహనరాగం , ఖండచాపు తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
లక్ష్మీనీ పాదము కాచి ఉన్నామమ్మా
కరుణాతో బ్రోవరావే ...
సన్నుతమతి నీవే వైభవంబులు నీవే
కల్లా కాదే నిజము హారతి గైకొనుము
లక్ష్మీనీ పాదము కాచి ఉన్నామమ్మా
చరణం :
చిన్నతనము నుండి చేసిన పాపములు ఎన్నెన్నో కలవు తల్లి
అన్ని పారద్రోలి కన్నతల్లిగా జూచి
కరుణింపవే మమ్ము హారతి గైకొనుము
లక్ష్మీనీ పాదము కాచి ఉన్నామమ్మా
మా మీద దయ ఉంచి నయముతో
వరరాశి ప్రేమతో మాకీయవే
క్షీరాబ్ధి కన్యవు శ్రీమహాలక్ష్మివి
స్ధిరముగా కాచుము హారతి గైకొనుము
లక్ష్మీనీ పాదము కాచి ఉన్నామమ్మా
కరుణాతో బ్రోవరావే ...హారతి గై కొనవే
హారతి గైకొనవే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి