21, ఆగస్టు 2017, సోమవారం

Amma cheti pasupu bomma అమ్మచేతి పసుపు బొమ్మ

అమ్మ చేతి పసుపు బొమ్మ
Audio
అమ్మ చేతి పసుపు బొమ్మ
ఆగమాల సారమమ్మా
అయ్య ఒడిని కూర్చున్న (కూరుచున్న) అపరూపపు బాలుడమ్మా

ముజ్జగాల నడిపించే గుజ్జు రూపు వేలుపు
ఒజ్జగ చదువులనిచ్చే బొజ్జసామి ఇతడే
వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడు
కొండంత దైవము చలి కొండ చూలి కొడుకు
...అమ్మచేతి…

పుష్టి తుష్టి నిచ్చును మా బుద్ది సిద్ధి విభుడు
ఒంటి పంటి దేవర మా కంటి రెప్ప ఇతడే
వంకరలను దునువాడును వంకర తొండమ్ము వాడు
వంక చందురుడు సుమమై వరలిన సిగవాడు
….అమ్మచేతి..

1 కామెంట్‌:

  1. చాలా బాగా పాడారండి పాట.. సామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన ఈ పాట.. మీ గాత్రం తో ఇంకా హాయి గా ఉంది

    రిప్లయితొలగించండి