మూషిక వాహన
మాయమాళవగౌళ రాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
మూషిక వాహన మునిజన భావన
నీ పదమే శరణు నీ పదమే శరణు
విజయ ప్రదాయక విఘ్న వినాయక
నీ పదమే శరణు నీ పదమే శరణు
చరణం :
ఓ బొజ్జ గణపయ్య దాసుల మేమయ్య
కరుణతో మమ్ముల కావుమయ్య
కరి వదన నీ పద సదనమునే
గతియని నమ్మితి బ్రోవుమయ్య
…..మూషిక వాహన మునిజన భావన…..
అంబా సుతుడవై ఆది దేవుడవై
ఆర్తుల గాచే అభయ దాయుడవై
సిద్ధుల బుద్ధుల స్థిరముగా మాకియ్య
ఇలకేతెంచిన ఇలవేల్పు నీవయ్యా
…..మూషిక వాహన మునిజన భావన…
నీ పదమే శరణు
నీ పదమే శరణు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి